అనియంత్రిత డిపాజిట్ ప‌థకాలపై నిషేధం

154

ముంబయి, ఫిబ్రవరి 26 (న్యూస్‌టైమ్): అనియంత్రిత డిపాజిట్ ప‌థకాలపై నిషేధం విధిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్సు, 2019కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం కూడా తెలిపింది. అత్యాశ గ‌ల నిర్వాహ‌క సంస్థ‌లు దేశంలో ఆరంభించిన అక్ర‌మ డిపాజిట్ స్వీక‌ర‌ణ కార్య‌క‌లాపాల బెడ‌దను ప్ర‌తిపాదిత ఆర్డినెన్సు త‌క్ష‌ణ ప్రాతిప‌దిక‌న అరిక‌ట్టగ‌లుగుతుంది.

ఈ సంస్థలు ప్ర‌స్తుతమున్న నియంత్ర‌ణప‌ర‌మైన లోపాలను అడ్డం పెట్టుకొని, క‌ఠిన‌మైన పాల‌న సంబంధిత చ‌ర్య‌లు కొర‌వ‌డ‌టంతో పేద‌ల‌ను, అమాయ‌కులైన ప్ర‌జ‌లను వంచించి, వారి క‌ష్టార్జితాన్ని దోచుకొంటున్నాయి. కాగా, అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాలను మొత్తం మీద నిషేధిస్తూ, మ‌రి అలాగే ఆ విధ‌మైన‌ ప‌థ‌కాలను ఏదో ఒక విధంగా డిపాజిట్ల‌ను చ‌ట్ట‌విరుద్ధంగా స‌మీక‌రిస్తున్న కేసులలో ఆయా సంస్థ‌ల‌ చేత స‌ద‌రు డిపాజిట్ల‌ను తిరిగి చెల్లించ‌డం, ఆయా సంస్థలను శిక్షించేందుకు త‌గిన నియ‌మ నిబంధ‌న‌లను అమ‌లు ప‌ర‌చ‌డం ప్ర‌తిపాదిత ఆర్డినెన్సు ల‌క్ష్యంగా ఉంది.