శరవేగంగా తెరకెక్కనున్న ‘వెంకీమామ’

289

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విక్ట‌రీ దగ్గుబాటి వెంక‌టేష్‌ తాజాగా తన మేనళ్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి చేస్తున్న ‘వెంకీమామ’ శరవేగంగా షూటింగ్ జరుపుకొనేందుకు సన్నద్ధమవుతోంది. నాగేంద్రబాబు తనయుడు వరుణ్‌తేజ్‌లో కలిసి వెంకీ నటించిన ‘ఎఫ్‌2’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుణ్‌తో వెంకీ చేసిన కామిక్ మ‌ల్టీ స్టార‌ర్‌ స్ఫూర్తితో తాజాగా నాగచైతన్యతో కలిసి చేయనున్న ‘వెంకీమామ’ తొలి షెడ్యూల్‌కు రాజమహేంద్రవరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుని వెనువెంటనే రెండో షెడ్యూల్‌కు రెడీ కావాలని భావిస్తోంది యూనిట్. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైత‌న్య నిజజీవతంలో పాత్రను చేస్తున్నాడు. తన మేనమామ అయిన వెంకీతో కలిసి నాగ్ అలరించనున్నాడు. శ్రియా శ‌ర‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. ఫిబ్ర‌వరి 22న చిత్రం సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ని, తొలి షెడ్యూల్‌ని రాజమహేద్రవరంలో జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.