తెలంగాణ వైతాళికుడు ‘వట్టికోట’

124
  • ప్రజాసాహిత్యానికి ఆళ్వార్‌స్వామి పాదులు

నల్గొండ, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్‌): తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు. ప్రచారకుడు కూడా అయిన ఆయన భాషా సాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా అన్నీ ఉద్యమాలల్లోనూ పాలుపంచుకున్నడు. 1915 నవంబర్‌ 1న నల్లగొండ జిల్లా నకిరేకల్‌ సమీపంలోని మాచవరం గ్రామంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించిన ఆళ్వారుస్వామి తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేసిండు. గ్రంధాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పని చేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది.

వట్టికోట జైలు జీవితం ‘జైలు లోపల’ పేరుతో కథల సంపుటిగా వెలువడింది. వంటపనిల, ప్రూఫ్‌ రీడింగ్‌ల, హోటల్‌ సర్వర్‌గా పని చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేసినయి. నిజాంను గడగడలాడించిన ‘ఆంధ్రమహాసభ’ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టిండి. తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952ల ‘ప్రజలమనిషి’ నవల రచించిండు. 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో ‘గంగు’ నవల రచించిండు. తెలంగాణ చైతన్యం కోసం ‘దేశోద్ధారక గ్రంథమాల’ స్థాపించి కొద్దికాలంలనే 35 పుస్తకాలు ప్రచురించటం ఆయన కృషికి నిదర్శనం. తెలంగాణ విశేషాలతో కూర్చి ‘తెలంగాణ’ పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి.

1961 ఫిబ్రవరి 5 న ఆయన మృతి తెలంగాణకు తీరని లోటుగా ఉండిపోయింది. ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు. దాశరధి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు కూడా తిన్నాడు. ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు వింటే ఆయనేమిటో కొంచమయినా అర్ధమవుతుంది. ”ఇస్లాం అంటే శాంతి. శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే! కానీ మీరు, మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు. కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి. దాంతో మనలో ఐక్యత నశించింది” వంటి సూటి మాటలు ఆయన్ని ఓ విప్లవకారుడిగా మార్చాయి. హోటల్‌ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై, ప్రచురణకర్త కూడా అయ్యాడు.

గ్రంధాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పని చేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యిండు. వంట పనిల, ప్రూఫ్‌ రీడింగ్‌ల, హోటల్‌ సర్వర్‌గా పని చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేసినయి. నిజాంను గడగడలాడించిన ఆంధ్రమహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టిండు. వట్టికోట జైలు జీవితం జైలు లోపల పేరుతో కథల సంపుటిగా వెలువడింది.

తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952ల ప్రజలమనిషి నవల రచించిండు. 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు నవల రచించిండు. తెలంగాణ చైతన్యం కోసం దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి 35 పుస్తకాలు ప్రచురించాడు. తెలంగాణ విశేషాలను కూర్చి, తెలంగాణ పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి. 1961 ఫిబ్రవరి 5న మరణించారు.