యువజన సాధికారతలకు అధిక ప్రాధాన్యత

39

అమరావతి, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): ప్రప్రథమంగా యువజన విధానాన్ని ప్రకటించి యువజన సంక్షేమం, సాధికారతలపై తన చిత్తశుద్ధిని చాటిన ప్రభుత్వం విద్యావంతులైన నిరుద్యోగ యువత ఆత్మగౌరవంతో తనకు తగిన, ఆసక్తి కలిగిన రంగంలో ఉద్యోగం సంపాదించుకునేలా ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన 4.3 లక్షలమంది నిరుద్యోగులకు నెలనెలా రూ.1,000ల భృతిని అందిస్తున్నారు.

తాజా బడ్జెట్‌లో ఈ భృతిని రెట్టింపు చేసి, నెలకు రూ.2,000ల ఇచ్చేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నెల నెలా నిరుద్యోగ భృతిని ఇవ్వడమే కాకుండా ఎస్ఐఈఎవఈఎన్ఎస్ సహకారంతో లక్ష మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం కలిగిన కేంద్రాలను నెలకొల్పి యువతకు ఆసక్తి ఉన్న రంగాలలో రాణించేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి 40 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 84,852 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 8.66 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.