హోదాకు అడ్డొచ్చే పార్టీలకు ఓటుతో గుణపాఠం

251

విశాఖపట్నం, జనవరి 28 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాకుండా అడ్డుకున్న పార్టీలను గద్దెదించుదామని, ఓటును ఆయుధంగా చేసుకొని హోదా సాధించుకుందామని విద్యార్ధులు యుక్తకంఠంతో చెప్పారు. వై.ఎస్‌.ఆర్‌.సి.పి విద్యార్థి విభాగం విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.కాంతారావు అధ్వర్యంలో గోపాలపట్నంలోని మురళీకృష్ణ డిగ్రీ కళాశాలలో వై.ఆంధ్రప్రదేశ్‌ నిడ్స్‌చేంజ్‌ పేరిట సోమవారం సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వేల్‌ఫేర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆసోషియేట్‌ ప్రోఫెసర్ బి. శ్రీనివాసు హాజరై మాట్లాడుటూ ఎన్నకల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి బి.జె.పి మోసం చేసిదన్నారు. దానిని సాధించవలసిన టి.డి.పి ప్రభుత్వం పోరాటం చేయకుండా మోసం చేసిదన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో యువత ఉద్యోగాలురాక, వారి భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారిందన్నరు. ఈ నేపథ్యంలో ఉజ్యల భవిష్యత్‌కు రానున్న ఎన్నకల్లో యువత తమ ఓటు హక్కు సద్వినియెగం చేసుకొవలాని పిలుపునిచ్చారు. టి.డి.పి. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఓటు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చి హామీని తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. వై.ఎస్‌.ఆర్‌. విద్యాప్రధాతగా విద్యార్ధి లోకంలో నిలిచిపోయారన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్ధ్ధులందరికీ ఉన్నత విద్యా అందించరన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఆ పథకాన్ని నిర్విర్యంచేసిందన్నారు. హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీలను తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్‌.ఆర్‌.ఎస్‌.యు. వై.ఎస్‌.ఆర్‌.సి.పి విద్యార్థి విబాగం విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.కాంతారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌. కళ్యాణ్‌ విద్యార్ధి విభాగం నాయకులు లీలాకృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గోన్నారు.