అభివృద్ధి పనులు పరిశీలించిన ఏయూ వీసీ

266

విశాఖపట్నం, జనవరి 28 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు సోమవారం ఉదయం పరిశీలించారు. అంబేద్కర్‌ అసెంబ్లీ మందిరానికి అనుబంధంగా నూతనంగా నిర్మిస్తున్న శౌచాలయాలను ఆయన పరిశీలించారు.

ఎన్‌టిపిసి అందిస్తున్న రూ 15 లక్షలు వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.జి మాధవ బాబు తెలిపారు. త్వరలో వీటి నిర్మాణం పూర్తిచేసి వారం రోజుల్లో అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులకు వీసీ నాగేశ్వర రావు ఆదేశించారు. పనుల నాణ్యత, ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు.