తెలుగు కవిగానే కీర్తిపొందిన భావశ్రీ!

291

శ్రీకాకుళం, జనవరి 26 (న్యూస్‌టైమ్): భావశ్రీగా పేరుగాంచిన వాండ్రంగి రామారావు తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు. భావశ్రీ 1935 జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం గంగువారిసిగడాం మండలంలోని సంతవురిటి గ్రామం. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు.

తల్లి అమ్మన్నమ్మ, గృహిణి. తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉన్నది. తెలుగుజాతి నాది… తెలుగు సంస్కృతి నాది… నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే అని చెప్పేవారు భావశ్రీ. ఈ మాటలు ఆయనకు మాతృభాషపై ఉన్న అచంచల అభిమానానికి నిదర్శనంగా నిలుస్తాయి.

ఆయన జీవితం అంతా సాహిత్యంతో ముడిపడి ఉంది. అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈయన రచలలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈయన పస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక శాఖకు అధ్యక్షునిగా ఉన్నారు. ఈయన ఈ శాఖ సభ్యునిగా రెండుసార్లు, అధికార భాషా సంఘం సభ్యునిగా మూడు సర్లు ఉన్నారు. ఈ నాటికి కూడా ఆయన సాహిత్యసెవలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆయన సాహిత్య రంగంలో 120 కంటే ఎక్కువ భావనలు పద్య, గద్య, నాటక, సమీక్ష, గజల్‌, కవితలను రాసారు. దూరదర్శన్‌లో ప్రసారమైన పద్యాలతోరణంలో భాషానైపుణ్యం ఉపయోగించిన మొదటి వ్యక్తి. నాగార్జున విశ్వవిద్యాలయం ఈయన రాసిన ఆరు పుస్తకాలకు ఎం.ఫిల్‌ ఇచ్చింది.