త్యాగధనులకు సీఎం కేసీఆర్ నివాళి

181

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): 70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం అమరవీరుల స్థూపం దగ్గర పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయనకు భద్రతా దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అంతకముందు సీఎం కేసీఆర్ తన అధికార నివాసం అయిన ప్రగతి భవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ సిబ్బంది, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.